విజయ్ చేస్తున్న స్టార్ క్రికెటర్ బయోపిక్ కొత్త అప్డేట్స్


సెలబ్రిటీల జీవితాలను బయోపిక్స్ రూపంలో ప్రేక్షకులకు అందించే ఆనవాయితీ బాగా ఊపందుకుంది. ఇప్పటికే ధోనీ, అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ లాంటి స్టార్ క్రికెటర్ల కథలు చిత్ర రూపం తీసుకోగా ఇప్పుడు శ్రీలంక స్టార్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ లైఫ్ స్టోరీ సినిమాగా రానుంది. ఇందులో మురళీధరన్ పాత్రను స్టార్ నటుడు విజయ్ సేతుపతి చేయనున్నారు. ఛాన్నాళ్ళ క్రితమే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ కోవిడ్ కారణంగా ఆగింది. మళ్లీ ఇప్పుడు షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు.

ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్ నిర్ణయించారు. మురళీధరన్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు కాబట్టి సినిమాకు ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఇందులో కథానాయకిగా మలయాళ నటి రజిశ విజయన్ నటించనుంది. దర్శకుడు శ్రీపతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ బయోపిక్ కోసం స్వయంగా మురళీధరన్ విజయ్ సేతుపతికి తన స్పిన్ బౌలింగ్ మెళకువలను నేర్పడం విశేషం. తమిళంతో పాటు పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Exit mobile version