స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఓ సినిమా వచ్చే సంవత్సరం మొదలు కానుంది. ఈ సినిమాని ఎక్కువ భాగం ఓవర్సీస్ లో షూట్ చేస్తారని మేము నిన్నే తెలిపాము. ఇప్పుడు ఆ సినిమాకి సంబందించిన ఇంకో వార్తని మీకు తెలియజేస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ ని చాలా వేగంగా పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర టీం ఈ సినిమాని 80 – 90 రోజుల్లో కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారు.
కంటెంట్ సాలిడ్ గా ఉంటే ఇదో మంచి సినిమా అవుతుంది. సినిమాని చాలా వేగంగా పూర్తి చేస్తే అభిమానులు కూడా చాలా ఆనందపడతారు. అలాగే ఈ కాంబినేషన్ కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. షూటింగ్ కోసం అనవసరమైన ఖర్చులు లేకుండా చూసుకోవడం, అలాగే షెడ్యూల్స్ ఆలస్యం కాకుండా చూసుకోవడంలో హరీష్ శంకర్ కి మంచి పేరుంది. ప్రస్తుతం అల్లు అర్జున్, హరీష్ శంకర్ చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఇది సెట్స్ పైకి వెళ్తుంది.