జపాన్‌లో భూకంపం.. డార్లింగ్ సేఫ్ అంటున్న మారుతి..!

Prabhas 2

జపాన్ ఈశాన్య తీరంలో 7.5-7.6 తీవ్రతతో భూకంపం రావడంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ జపాన్‌లో ఉండటమే వారి ఆందోళనకు గల కారణం.

“బాహుబలి: ది ఎపిక్” స్పెషల్ స్క్రీనింగ్‌ల కోసం ప్రభాస్ జపాన్‌కు వెళ్లారు. భూకంపం వార్తలు వైరల్ కావడంతో ఆయన సేఫ్‌గా ఉన్నారా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీనికి దర్శకుడు మారుతి స్పందిస్తూ.. “ప్రభాస్‌తో మాట్లాడాను.. ఆయన టోక్యోలో లేరు.. ఆయన సేఫ్‌గానే ఉన్నారు” అని తెలిపారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రభాస్ తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత ‘స్పిరిట్’ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అవుతారు. అంతేగాక ‘ది రాజా సాబ్’ చిత్ర ప్రమోషన్లలో కూడా ఆయన పాల్గొననున్నారు.

Exit mobile version