ఎన్టీఆర్ బర్త్‌ డే కోసం ఫ్యాన్స్ సందడి !

జూ ఎన్టీఆర్‌ ఈ రోజు తన 42వ పుట్టినరోజు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడే కనిపిస్తోంది. ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో అభిమానులు ఫుల్ బిజీ అయిపోయారు. అలాగే, సినీ ప్రముఖుల్లో కొందరు ఎన్టీఆర్ కి బర్త్‌ డే విషెస్ చెబుతూ మెసేజ్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వీరాభిమానులు కొందరు తమ అభిమాన హీరో ఇంటి ముందు ఈగల్లా వాలిపోయారు. ఈ ఉదయం నుంచి ఎన్టీఆర్ ఇంటి చుట్టూ అభిమానులు కుప్పలు తెప్పలుగా పోగయ్యారు.

తమ హీరోని చూసి బర్త్‌ డే విషెస్ చెప్పడానికి ఎగబడ్డారు. దీనికితోడు అక్కడ ఎన్టీఆర్ కటౌట్స్ కూడా మాస్ లుక్‌ లో దర్శనం ఇచ్చాయి. దీంతో అభిమానులు అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ జీవితంలో మరెన్నో విజయాలు అందుకోవాలి. అలాగే జీవితాంతం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఫ్యాన్స్ లో కొందరు పూజలు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు అంతా ‘హ్యాపీ బర్త్‌డే తారక్‌’ హ్యాష్ టాగ్ వైరల్ గా మారింది.

Exit mobile version