సోషల్ మీడియా ట్రెండింగ్ అనేది స్టార్ హీరో ఫ్యాన్స్ లో క్రేజీ హ్యాబిట్ గా మారిపోయింది. సంధర్భంగా ఏదైనా మిలియన్ ట్వీట్స్ చేస్తూ, రికార్డుల మాత మోగిస్తున్నారు. బర్త్ డే నుండి కొత్త సినిమా ప్రకటన, టైటిల్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ఒకటేంటి..తమ హీరోకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా ట్రెండ్ కావలసిందే. తాజాగా మహేష్ ఫ్యాన్స్ ఎటువంటి సంధర్భం లేకుండా సోషల్ మీడియాలో సందడి చేశారు. బాక్సాఫీస్ ఎంపరర్ సూపర్ స్టార్ మహేష్ అంటూ ఓ యాష్ టాగ్ వారు తెగ ట్రెండ్ చేయడం జరిగింది.
నేటి సాయంత్రం వరకు ఈ ట్రెండ్ కొనసాగనుండగా…100 మిలియన్ మార్కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం మహేష్ ఫ్యాన్స్ గట్టిగానే ట్రై చేస్తున్నట్లు సమాచారం. మరి వాళ్ళ టార్గెట్ ఎంత వరకు రీచ్ అవుతారో తెలియాలంటే రేపు సాయంత్రం 6:00 వరకు ఎదురు చూడాల్సిందే.
ఇక జనవరి నుండి సర్కారు వారి పాట మూవీ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన కీర్తి సురేష్ తాను జనవరి నుండి సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొననున్నట్లు ఇటీవల తెలియజేయడం జరిగింది. మరి మహేష్ తో దర్శకుడు అంతకు ముందే షెడ్యూల్ ప్రారంభించే అవకాశం లేకపోలేదు. సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ అమెరికాలో ప్రారంభం కానుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.