క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బబ్లీ బ్యూటీ రాశీఖన్నా, అలాగే ఐశ్వర్యా రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్ గా ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రాబోతున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 6న సాయంత్రం 4 గంటల 05 నిముషాలకు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కాగా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కూల్ కంపోజర్ గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ గత చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.
మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ కు హిట్ ఇస్తోందా.. టైటిల్ అయితే క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా కోసం రాశీఖన్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పింది.