రామ్ లేటెస్ట్ మూవీ ‘ఒంగోలు గిత్త’ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 1న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి రామ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. “ఇప్పటి వరకు నేను లవ్ స్టొరీ, మాస్ సినిమాలు చేసాను. కానీ ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించాం. నాకు తండ్రిగా ప్రభు గారు నటించారు. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగంతో ఉంటాయి. ఈ తరహా సినిమా నేనింతవరకూ చేయలేదు. ఇప్పటి వరకూ నేను అల్లరి చిల్లరగా ఉండే పత్రాలు చేశాను కానీ ఇందులో మాత్రం మెచ్యూరిటీ ఉన్న పాత్ర చేసాను. భాస్కర్ గత చిత్రాల లాగానే ఆయన స్టైల్ ప్రేమకథ, సున్నితమైన భావోద్వేగాలతో మాస్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది” రామ్ సరసన కృతి ఖర్బంధ నటించిన ఈ సినిమాకి భాస్కర్ దర్శకుడు.