యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ దుమ్మురేపుతున్న ఈటీవీ ప్రోగ్రామ్స్

యూట్యూబ్ లో ఈటీవీ కంటెంట్ దూసుకుపోతుంది. టాప్ టెన్ ట్రెండింగ్ వీడియోలలో ఆరు వీడియోలు ఈటీవికి చెందినవి అంటే, ఆ ప్రోగ్రామ్స్ కి ప్రేక్షకులలో ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతుంది. వరుసగా ఆరు ఈటీవీ ప్రోగ్రామ్స్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇటీవల షూటింగ్స్ కి అనుమతులు ఇవ్వడంతో అన్ని షోలు మరియు సీరియల్స్ షూటింగ్స్ మొదలుపెట్టాయి. దీనితో అత్యంత ప్రజాదరణ ఉన్న ఢీ ఛాంపియన్స్, జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్ తిరిగి ప్రారంభం అయ్యాయి.

దీనితో సదరు ప్రోగ్రామ్స్ ఎపిసోడ్స్ మరియు ప్రోమోలు యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. నిన్న ప్రసారం అయినా ఢీ చాంపియన్స్ టాప్ ట్రెండ్ లో కొనసాగుతుండగా… ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో సెకండ్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. ఢీ ఛాంపియన్స్ ప్రోమోలు 3,4 స్థానాలలో, జబర్దస్త్ ప్రోమో 5లో కొనసాగుతుంది. ఇక 6వ స్థానంలో ఈటీవీకే చెందిన మనసు మమత సీరియల్ ట్రెండ్ అవుతుంది.

Exit mobile version