గత మిస్ మహారాష్ట్ర ఎరికా ఫెర్నాండేజ్ కన్నడలో ఒక భారీ ఆఫర్ ను అందుకుంది. కన్నడ లో తన మొదటి చిత్రాన్నే అక్కడ సూపర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ తో కలిసిచెయ్యనుంది. ఈ సినిమాకు జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు ‘నిన్నిడాలే’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. విజయ్ కిరణ్ గందుర్ ఈ సినిమాకు నిర్మాత. ఆగష్టు 12 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇదివరకు ఎరికా ఫెర్నాండేజ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న సినిమాలో కనిపిస్తుందని పుకార్లు వచ్చాయి. అయితే వాటికి ఎరికా ఫెర్నాండేజ్ వెంటనే స్పందించి సమాధానం ఇచ్చింది. ఈ భామ ఇప్పటికే ‘డేగ’ అనే తెలుగు సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఇంకా విడుదలకాలేదు. ఆమె భరత్ సరసన నటించిన తమిళ సినిమా ‘555’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడలో ఈ భారీ ప్రాజెక్ట్ కాకుండా తెలుగులో మరో కామెడీ సినిమాలో సైతం ఆమెను ఎంచుకున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు