ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడం నా బాధ్యత : అనుష్క

Anushka-3
దక్షిణాదిన మంచి సినిమాలను తన జమాలో వేసుకుంటూ బిజీగా కొనసాగుతున్న తార అనుష్క. ‘సూపర్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన దగ్గరనుండి ఆమె వెనుతిరిగి చూడడంలేదు. ‘అరుంధతి’ తరువాత మహిళా ప్రాధాన్యమున్న పాత్రలకు తను మొదటి ఎంపికగామారింది

ఆమె గతాన్ని తలుచుకుంటూ “నేను నిజంగానే నటిస్తున్నానా లేదా కలగంటున్నానా అన్న ప్రశ్న మొదట్లో నన్ను తోలిచేది. ఇండస్ట్రీకి వచ్చిన నేను చాలా విషయాలు నేర్చుకుని దాని ద్వారా నాలో కలిగిన మార్పుకు ఆశ్చర్యపోయాను. నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడం నా బాధ్యతగా భావిస్తానని” తెలిపింది

ప్రస్తుతం అనుష్క చాలా బరువు తగ్గి స్క్రీన్ మీద రాచరికం ఉట్టిపడేలా ‘బాహుబలి’ సినిమాలో నటిస్తుంది

Exit mobile version