గొడ్డలి పట్టుకొని ఫైట్ చేసిన ఎన్.టి.ఆర్

Ramayya-Vasthavayya2

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నట్టిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆసక్తి కరమైన విషయాలు ఒక్కొక్కటి నిదానంగా తెలుస్తున్నాయి.

మేము విన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చాలా ఎమోషనల్ ఫైట్ ని ఒకటి ఉంది. ఈ ఫైట్ లో ఎన్.టి.ఆర్ గొడ్డలి పట్టుకొని కనిపించనున్నాడు. ఈ ఫైట్ సినిమాలో చాలా కీలకమైన సందర్భంలో వస్తుందని అంటున్నారు. ఈ సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించగా, ఈ ఫైట్ బాగా రావడంతో ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ ఆయన చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ను చాలా పవర్ ఫుల్ గా, స్టైలిష్ గా హరీష్ శంకర్ చూపించనున్నాడు. ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. సమంత, శృతి హసన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు.

Exit mobile version