ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి హిట్ చిత్రాలతో ఎంతో మంది కొత్త ఆర్టిస్ట్స్ నీ, టెక్నిషియన్స్ నీ పరిచయం చేసిన క్రెడిట్ దక్కించుకున్న డైనమిక్ లేడీ డైరెక్టర్, బహుముఖ ప్రజ్ఞావంతురాలు జయ బి. 57వ జయంతి నేడు. “చంటిగాడు”.. “గుండమ్మగారి మనవడు”.. “ప్రేమికులు”.. “లవ్లీ” లాంటి సినిమాలతో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆమె తెరకెక్కించిన చివరి సినిమా “వైశాఖం”. 2017లో ఈ చిత్రం విడుదలైంది. ఎమ్ఏ సైకాలజీ చదివిన జయ.. ఓ న్యూస్ పేపర్ లో తమ ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి 2003లో “చంటిగాడు” సినిమాతో దర్శకురాలిగా మారారు. బాలాదిత్యను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేసారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది లేడీ డైరెక్టర్స్ లో జయ కూడా ఒకరు. అంతేకాదు.. తెలుగు ఇండస్ట్రీకి “ప్రేమికులు” సినిమాతో కామ్నా జఠ్మిలానీ.. “చంటిగాడు”తో సుహాసిని.. “లవ్లీ” సినిమాతో శాన్విని హీరోయిన్‌గా పరిచయం చేసింది జయే.