యంగ్ హీరో నితిన్ హీరోగా మళయాళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఈ రోజు ఉదయం శబ్దాలయా స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభమైంది. నితిన్ స్టైలిష్ అవర్తారంలో కనిపించనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. ‘ఇష్క్’ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ – నిత్యా మీనన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మళ్ళీ ఆ హిట్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.