ఇలా అయితే తారక్ నుంచి డబుల్ ఫీస్ట్ మిస్సయ్యినట్టే.?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ స్థాయి పీరియాడిక్ వండర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అలాగే ఈ సినిమా నుంచి భీం టీజర్ గా తారక్ ను చూసాక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఇది లైన్ లో ఉండగానే తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన రెండో సినిమా కూడా అనౌన్స్ చెయ్యడం జరిగింది. RRR అయ్యాక వెంటనే దీనిలో జాయిన్ అవ్వడం ఉంది. ఇక ఈ చిత్రం కూడా ఎక్కువ సమయం పట్టకుండా లాస్ట్ అరవింద సమేత లానే త్వరగా ముగించేసి దసరా బరిలో నిలపాలని టాక్ వచ్చింది.

అయితే మరి అంతకు ముందే కనుక అంటే సమ్మర్ లో RRR వచ్చేస్తే వచ్చే ఏడాది తారక్ నుంచి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి కానీ ఇప్పుడు అనూహ్యంగా RRR దసరా సీసన్ లోకి షిఫ్ట్ అయ్యింది అని గట్టి టాక్ వినిపిస్తుంది. మరి అలాంటి సినిమా మారినప్పుడు చాలానే అంశాలు మారుతాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే తారక్ నుంచి డబుల్ బొనాంజా మిస్సయ్యినట్టే అని చెప్పక తప్పదు. మరి దేనికైనా సరే కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version