‘యు/ఏ’ సొంతం చేసుకున్న మంచు విష్ణు ‘దూసుకెళ్తా’

doosukeltha

మంచు విష్ణు హీరోగా నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దూసుకెళ్తా’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఈ నెల 17కి వాయిదా పడింది.

ఈ సినిమాలో బాగా ఎక్కువగా కామెడీ ఉంటుందని ఆశిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ చాలా సేపు తెరపై కనిపించి బాగా నవ్వించనున్నారు. వీరూ పోట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. విష్ణు ఈ సినిమాని తన సొంత బ్యానర్ పై నిర్మించారు.

Exit mobile version