ఫ్లాప్స్ విషయంలో ఆడియన్స్ ని నిందించకూడదు – నాగ్

Nagarjuna

‘కింగ్’ అక్కినేని నాగార్జున ఉన్నది ఉన్నట్లు ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే వ్యక్తి. కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంటారు. ఈ రోజు ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున సినిమాల గురించి తను చూసిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు.
‘ ఒక సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకుల్ని నిందించకూడదు. ఎందుకంటే కథని పర్ఫెక్ట్ గా రెడీ చేసుకోకపోవడం, ప్లాన్ చేసుకోవడం సరిగా లేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి రేపు షాంగ్ షూటింగ్ ఉండనుకోండి మ్యూజిక్ డైరెక్టర్ ఈ రోజు సాయంత్రం పాటిస్తాడు. దాంతో కొరియోగ్రాఫర్ కి క్రియేటివ్ గా స్టెప్స్ కంపోజ్ చెయ్యడానికి టైం ఎక్కడుంది? అలాగే హీరో హీరోయిన్ తమకు నచ్చిన కాస్ట్యూమ్స్ లో సెట్స్ కి వస్తారు తీరా చూస్తె ఆ సెట్ కి వారి కాస్యూమ్స్ కి సెట్ అవ్వదు. అప్పుడు అది ఎలా బాగుంటుంది చెప్పండి? ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే టీం లోని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. స్క్రిప్ట్ దశలోనే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత, కొరియోగ్రాఫర్ కూర్చొని పాట ఎలా రావాలి, ఎలా తీయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే చాలా విషయాలు క్లియర్ గా ఉంటాయని’ నాగార్జున అన్నాడు.

నాగార్జున త్వరలోనే భాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే వీరభద్రం చౌదరి డైరెక్టర్.

Exit mobile version