పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేయనున్న సాలిడ్ యాక్షన్ చిత్రం స్పిరిట్ కూడా ఒకటి. ఇన్నాళ్ళైనా కూడా ఈ సినిమాపై హైప్ ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇక ఈ సినిమాలో కొరియన్ బాలయ్య డాన్ లీ ఉన్నట్లు ఎప్పుడు నుంచో క్రేజీ బజ్ ఉంది.
దీనితో ఈ సినిమాలో డాన్ లీ ఉన్నాడా లేదా అనేది సందీప్ వంగ క్రేజీ హింట్ తో రివీల్ చేశారు. అయితే మెగాస్టార్ విషయంలో క్లారిటీ గానే లేరని చెప్పేసారు. కానీ డాన్ లీ విషయంలో మాత్రం ఇస్తా అప్డేట్ ఇస్తా అంటూ అవాయిడ్ చేయకుండా చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనితో ఫ్యాన్స్ లో హోప్స్ మరింత పెరిగాయి. ఇక ఈ క్రేజీ కలయికలో అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
