మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు.
ఈ థాంక్యూ మీట్ లో డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండీ సినిమా తీయాలంటే చాలా కష్టం. సినిమాని రిలీజ్ చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడం ఇంకా పెద్ద టాస్క్. అయితే ఈ జర్నీ ఎంత కష్టమైనా ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఆడియన్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక నమ్మకం గురించిన కథ ఇది. ఒక లైట్ హార్టెడ్ కామెడీతో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం జరిగింది. ఉష నేచురల్ డాన్స్ టాలెంట్ చూసి ఈ సినిమాలో తీసుకున్నాం. వర్క్ షాప్స్ కూడా చేయించాం. రామకృష్ణ, ఉష పాత్రలకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వారు నా నమ్మకాన్ని నిలబెట్టారు. నటులు కావాలని వాళ్ళ కలని మీరందరూ నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు మరిన్ని అవకాశాలు వారికి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్” ఇస్తుంది.
హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. రామకృష్ణ పాత్రతో మీరందరూ కనెక్ట్ అయి ఎంకరేజ్ చేసిన విధానం నాకు ఆనందాన్ని ఇచ్చింది. రామకృష్ణ పాత్రకి అందరూ కనెక్ట్ అయ్యారు. చాలామంది మెసేజ్లు పెట్టారు. ఇందులో అన్ని పాత్రలకు పర్సనల్గా రిలేట్ అయ్యారు. కొత్త నటీనటులైన మా అందరినీ యాక్సెప్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. ప్రవీణ గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానా గారు ఇలాంటి మరిన్ని సినిమాలు కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలా చేయాలంటే మీరందరూ ధియేటర్స్ కి వచ్చి సినిమాని సపోర్ట్ చేయాలి’ అన్నారు.
కొరియోగ్రాఫర్ మెహరా బాబా మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రవీణ గారికి ధన్యవాదాలు. ఇందులో సాంగ్స్ అన్ని సింగిల్ కార్డు చేశాను. టీమ్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు ప్రవీణ్ గారు చాలా కేర్ తీసుకున్నారు. తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా ఇది” అన్నారు.
ఉషా బోనేలా మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ప్రవీణ గారు నాకు ఈ అవకాశం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మనోజ్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను తప్పకుండా ఈ సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
ఇక మౌనిక మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ప్రవీణ గారికి ధన్యవాదాలు. ఈ క్యారెక్టర్ కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. మనస్పూర్తిగా నటించాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ గారికి ధన్యవాదాలు. టీం లో ప్రతి ఒక్కరికి థాంక్యూ. చాలా మంచి సినిమా ఇది తప్పకుండా థియేటర్స్ లో చూడండి” అన్నారు.