తనికెళ్ళ భరణి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఆ తరువాత ‘అంగ్రేజ్’ సినిమాకి డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేసిన కృష్ణ స్వామి శ్రీకాంత్ అయ్యంగార్ ‘ఏప్రిల్ ఫూల్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జగపతి బాబు లాయర్ పాత్రలో, జర్నలిస్ట్ పాత్రలో భూమిక నటించిన ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి మొదటగా ఏప్రిల్ 2 విడుదల అనే టైటిల్ పెట్టాలనుకున్నాము కానీ ఏప్రిల్ 1 విడుదల చిత్ర టైటిల్ ని కాపీ కొట్టినట్లు ఉంటుందని ఏప్రిల్ ఫూల్ అని పెట్టాము. ఇది ఇప్పుడొస్తున్న అన్ని సినిమాలలాగే రెగ్యులర్ గా ఉంటుంది కానీ ట్రీట్ మెంట్ విభిన్నంగా ఉంటుంది. అలాగని నేనేమీ కళాఖండం తీసానని చెప్పట్లేదు. తాగుబోతు రమేష్, ధనరాజ్ కామెడీ బావుంటుంది. ఇదే కాకుండా నీలకంఠ గారి డైరెక్షన్లో వస్తున్న ‘చమ్మక్ చల్లో’ సినిమాలో హీరోయిన్ సంచిత పదుకొనే తండ్రిగా నటించాను. ఒక పాట మినహా ఏప్రిల్ ఫూల్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినీమా త్వరలో విడుదల చేస్తామని’ అన్నారు.