అనుకున్న తేదీకే రానున్న రామయ్యా వస్తావయ్యా

Ramayya-Vasthavayya-Poster

ఈ రోజు సాయంత్రం దిల్ రాజు ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా రిలీజ్ డేట్ ని తెలియజేసారు. ఈ సినిమాని ముందుగా అనుకున్న దాని ప్రకారమే అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చివర్లో వచ్చే కొన్ని సన్నివేశాలకు రీ రికార్డింగ్ జరుగుతోందని దిల్ రాజు తెలియజేశారు. ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ అతిధి పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమా విజయం పై ఎంతో నమ్మకంగా ఉన్న దిల్ రాజు మాట్లాడుతూ ‘ మేము ఎన్.టి.ఆర్ ని ‘బృందావనం’ లో సరికొత్త అవతారంలో చూపించాం. ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యాతో వస్తున్నాం. ఇప్పటికే ఈ మూవీ లోని ఎన్.టి.ఆర్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ హరీష్ శంకర్ కి హ్యాట్రిక్ హిట్ ఫిల్మ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఆడియో సక్సెస్ అయ్యింది. మా బ్యానర్ కి కొన్ని విలువలు ఉన్నాయి, వాటిని మీరు సినిమాలో చూస్తారని’ అన్నాడు.

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఆడియో రిలీజ్ తర్వాత ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి, అయినా పరవాలేదు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి అంచనాలను అందుకునే స్థాయిలో ఉంటుంది. షాక్ లాంటి ఫ్లాప్ తర్వాత కూడా ఎన్.టి.ఆర్ నన్ను ఓ ఫ్రెండ్ లా ట్రీట్ చేసారు. దిల్ రాజు గారి బ్యానర్ లో పనిచెయ్యడం చాలా అనడంగా ఉంది. స్క్రిప్ట్ మరియు తనకి ఏమి కావాలి అనే విషయాల్లో క్లారిటీ ఉన్న మనిషి దిల్ రాజు అని’ అన్నాడు.

Exit mobile version