ప్రభాస్ టైటిల్ ని దిల్ రాజు వాడుకున్నారట.

ప్రభాస్ టైటిల్ ని దిల్ రాజు వాడుకున్నారట.

Published on Feb 3, 2020 10:04 PM IST

సమంత-శర్వా నంద్ హీరోహీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ జాను ఈనెల 7న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై ద్రుష్టి సారించారు. నేడు నిర్మాత దిల్ రాజు పాత్రికేయుల సమావేశంలో పాల్గొని జాను చిత్ర విశేషాలు పంచుకున్నారు. కాగా జాను టైటిల్ గురించి ఆయన ఆసక్తికర విషయం వెల్లడించారు.

జాను టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటని పాత్రికేయులు అడుగగా, ‘ఈ చిత్రం సెన్సిబుల్ లవ్ స్టోరీ కావడంతో ఓ సోల్ ఫుల్ టైటిల్ పెట్టాలని భావించాము. అందుకే జాను ఐతే బాగుంటుందని ఆ టైటిల్ నిర్ణయించాము. ఐతే అప్పటికే ఇదే టైటిల్ తో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోందని తెలుసుకొని, ఆ చిత్ర నిర్మాత యూవీ క్రియేషన్స్ అధినేతలతో ఒకరైన వంశీ కి ఫోన్ చేశాను, ఇలా జాను టైటిల్ 96 రీమేక్ కి తెలుగు టైటిల్ గా పెట్టుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పగా ఆయన సానుకూలం స్పందించారు, దీనితో ప్రభాస్ మూవీ వర్కింగ్ టైటిల్ మా చిత్రానికి పెట్టుకున్నాం.. అన్నారు దిల్ రాజు .

తాజా వార్తలు