కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “బైసన్”. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన రూరల్ అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. అయితే తమిళ్ లో మంచి హిట్ గా నిలిచింది ఈ సినిమా. రీమేక్ కాకుండా ధృవ్ ఈ సినిమాని మాత్రమే తన డెబ్యూ సినిమాగా భావించి రిలీజ్ చేసుకోగా ఈ సినిమాతో తాను 50 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు.
ఇక ఇప్పటికీ ఈ సినిమా సాలిడ్ వసూళ్లు రాబడుతూ కొనసాగుతుంది. మరీ సినిమా ఇప్పుడు 70 కోట్ల మార్క్ ని చేరుకోవడం విశేషం. దీనితో తన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా మరింత లెవెల్లో దూసుకెళ్తుంది. ఇక ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రజిష విజయన్ లు హీరోయిన్స్ గా నటించగా సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా రంజిత్, అదితి ఆనంద్ లు నిర్మాణం వహించారు.
From his roots to glory ????
A glory that speaks for hundreds of thriving individuals ????#BisonKaalamaadan ???????? Raging Success – Worldwide ₹70 crore gross ????#BlockBuster Raids in Theatres Near You!! ????????@applausesocial @NeelamStudios_ @nairsameer @deepaksegal @beemji… pic.twitter.com/0AXoOqxRpO— Mari Selvaraj (@mari_selvaraj) November 12, 2025
