ఏపిలో భారీగా రిలీజ్ కానున్న ధూమ్ 3

ఏపిలో భారీగా రిలీజ్ కానున్న ధూమ్ 3

Published on Dec 16, 2013 3:58 PM IST

dhoom-3
అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న ‘ధూమ్ 3’ సినిమా ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సంవత్సరం రెండవ సారి ఓ హిందీ సినిమా తెలుగు బాక్స్ ఆఫీసు ని షేక్ చెయ్యడానికి వస్తోంది. నవంబర్ లో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 3 సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అదే రీతిలో ధూమ్ – 3 పైన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సాయి కొర్రపాటి కొనుగోలు చేసారు. మన రాష్ట్రంలో తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం హై రేంజ్ లో ఈ సినిమాకి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. బాలీవుడ్ బిగ్ స్టార్స్ ఇందులో ఉండడం వల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్టర్. ధూమ్ 3 ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు