పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మొదటి పాటకు సంబంధించిన ప్రోమో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.
అయితే, ఈ ప్రోమో ముందే చిత్ర యూనిట్ ఈ పాట వివరాలు బయటపెట్టారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట “దేఖ్ లేంగే సాలా” అంటూ రానుంది. ఈ పాట విషాల్ దద్లాని వాయిస్‌తో, భాస్కరభట్ల లిరిక్స్‌తో రూపొందుతోంది. ఈ వివరాలు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 13, 2025న విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సాయంత్రం రానున్న ప్రోమోతో పాటు సాంగ్ రిలీజ్ అధికారిక ప్రకటన కూడా ఉంటుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.


