ఏపీలో ‘ఓజి’కి తగ్గిన టికెట్ రేట్స్.. ప్లస్ అయ్యిందా!

OG-Pawan-Kalyan-1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ ధరలతో వచ్చింది. కానీ ఫైనల్ గా నైజాంలో మొదట టికెట్ రేట్ లు తగ్గించారు. తర్వాత ఏపీలో ఇపుడు తగ్గించడం జరిగింది.

అయితే ఇది వరకు పలు సినిమాలు పెంచేసిన టికెట్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలానే ఓజి కి కూడా జరిగింది. దీనితో మొదటి వీకెండ్ తర్వాత వీక్ డేస్ లోకి వచ్చాక ఫ్యామిలీ ఆడియెన్స్, మిడిల్ క్లాస్ ఆడియెన్స్ కొంచెం దూరం అయ్యారు. అయితే ఇపుడు ఏపీలో తగ్గించిన టికెట్ ధరలతో ఈ ఆదివారం సాలిడ్ అక్యుపెన్సీ లని ఓజి చూసినట్టు తెలుస్తుంది.

ఉదయం నుంచి మధ్యాహ్నం ఆట వరకు చాలా స్క్రీన్స్ లో 80 నుంచి 90 శాతం ఫుల్స్ పడితే ఫస్ట్ షో నుంచి సెకండ్ షోస్ కి అయితే అనేక చోట్ల హౌస్ ఫుల్స్ ఓజి కి పడ్డాయి. దీనితో తగ్గించిన టికెట్ ధరలు ఇంకా వీకెండ్ ఓజి కి బాగా వర్క్ అయ్యింది అనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఇదే పని ఇంకా ముందు చేసి ఉంటే ఓజి మరింత బెటర్ గా పెర్ఫామ్ చేసి ఉండేది అని చెప్పొచ్చు.

Exit mobile version