హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్ 3’ సినిమా ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద సోలోగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి కాంపిటీషన్ ఏమీలేకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ లో డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా హిందీ రిలీజ్ తో పాటు తెలుగులో కూడా డబ్ చేసి ఈ రోజే రిలీజ్ చేస్తున్నారు.
మేము కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగుందని తెలియజేశాము. ప్రియాంక చోప్రా, కంగన రనౌత్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్ విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో స్పెషల్ విలన్స్ కూడా ఉండడంతో పిల్లల్ని బాగా ఆకట్టుకుంటుందని ఆశించవచ్చు. రాకేశ్ రోషన్ ఈ సినిమాకి నిర్మాత మరియు దర్శకుడు. ఈ సినిమాకి ముందు వచ్చిన సీక్వెల్స్ లాగా హృతిక్ రోషన్ హిట్ అందుకుంటాడో లేదో ఇప్పుడు చూద్దాం..