విక్టరీ వెంకటేష్ సరికొత్త స్టైలిష్ అవతారంలో డాన్ పాత్రలో చేస్తున్న సినిమా ‘షాడో’. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అలాగే ఇటీవలే విడుదల చేసిన ఈ వెంకీ ఫోటోలు అభిమానులకి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ‘ ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ డిసెంబర్ 22 నుండి మొదలవుతుంది. ఆ తర్వాత ఒక పాట మరియు మిగిలిన కొన్ని సీన్స్ ని షూట్ చేస్తాము. జనవరి చివరికల్లా సినిమా పూర్తవుతుంది. ఫిబ్రవరిలో సినిమా ఎప్పుడు విడుదల చేసిది తెలియజేస్తామని’ ఈ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తెలిపాడు. ఈ సినిమాలో వెంకీకి జోడీగా ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీ కాంత్, మధురిమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నాడు.