దేవదాసు చిత్రంతో తెరకు పరిచయమయిన గోవా బ్యుటి ఇలియానా తెలుగు మరియు తమిళంలో 20 చిత్రాలకు పైగా చేసింది. దక్షిణాదిన టాప్ హీరొయిన్ గా వెలిగిన ఇలియానా “బర్ఫీ” చిత్రంతో బాలివుడ్ కి పరిచయం అయ్యింది. ఆ చిత్రం అక్కడ విజయం సాదించడంతో ఈ గోవా బ్యూటి ముంబైకి మకాం మార్చింది ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన “ఫటా పోస్టర్ నిఖ్‌లా హీరో’ చిత్రంలో నటిస్తుంది రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో బాలివుడ్లో తనకి మంచి అవకాశాలు వస్తుందని ఇలియానా అంటున్నారు. అక్కడ కూడా దక్షిణాదిన ఉన్న ఇమేజ్ ని సంపాదించుకోవాలని ఇలియానా అనుకుంటున్నారు. ఒక ప్రముఖ దినపత్రిక తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించగా ‘‘ఈ ప్రశ్న పెళ్లి గురించే అనుకుంటాను. ఇప్పట్లో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఆలోచన లేదు. పెళ్లి చేసుకోవాలంటే వేలికి ఉంగరం తొడిగించుకోవాలనో నేను అనుకోను. మన జీవితం మన ఇష్టం. నాకు సహజీవనం సమ్మతమే’’ అన్నారు. ప్రేమ గురించి అడుగగా అది పూర్తి వ్యక్తిగత విషయం సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తాను అని చెప్పారు.