‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే ఫస్ట్ షోకి డేట్ వచ్చేసింది!

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. మరి రామ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ సాంగ్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. అయితే ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి సిద్ధం అయ్యింది.

ఇది ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు. ఇది కూడా ఒక సాంగ్. దీనికి మేకర్స్ డేట్ ఇచ్చేసారు. ఈ సాంగ్ ని ఈ నవంబర్ 12న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సంగీత దర్శకులు వివేక్ – మెర్విన్ ల వర్క్ కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ నవంబర్ 28న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version