మంచు వారి ఫ్యామిలీ మల్టీ స్టారర్ లో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. ఆయన ఈ సినిమాలో రవీనా టాండన్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. సినిమాలో ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందంట. ఈ పాత్ర కోసం డాక్టర్ దాసరి నారాయణరావు గారికి ప్రత్యేకమైన వస్త్రాలను రూపొందిస్తున్నారు
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రధానపాత్రలను పోషించనున్నారు. వరుణ్ సందేశ్, తనీష్ ముఖ్యపాత్రధారులు. హన్సిక, ప్రణీత మరియు రవీనా టాండన్ హీరోయిన్స్
శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విష్ణు మరియు మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమపాళ్ళలో సెంటిమెంట్ ను కలిగి, హాస్యభరితంగా సాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది