“అందాల రాక్షసి” చిత్రంతో పరిచయం అయిన నవీన్ చంద్ర త్వరలో “దళం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్రంలో అయన నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ చిత్ర చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. పియా బాజ్పాయి నవీన్ చంద్ర సరసన నటిస్తుంది కిషోర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 1న మరియు చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆయుధాలను వదిలిన నక్సల్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి ఉంటుంది. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ ద్విభాషా చిత్రానికి జేమ్స్ వసంతాన్ సంగీతం అందిస్తున్నారు.