ఏపిలో డీ ఫర్ దోపిడీకి అడ్వాన్స్ షోస్

ఏపిలో డీ ఫర్ దోపిడీకి అడ్వాన్స్ షోస్

Published on Dec 16, 2013 10:30 AM IST

D-For-Dopidi
వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డీ ఫర్ దోపిడీ’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరాజ్ కల్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని రాజ్ – డీకే – నాని కలిసి నిర్మించారు. ఈ సినిమాని దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ అంతటా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు రోజు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ సిటీలలో స్పెషల్ షోస్ వెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

గతంలో శేఖర్ కమ్ముల కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి షోస్ ప్లాన్ చేసేవారు. యూత్ ని టార్గెట్ చేస్తూ క్రైమ్ కామెడీ కథాంశంతో ‘డీ ఫర్ దోపిడీ’ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్ర మేకర్స్ హైదరాబాద్ తో పాటుగా వైజాగ్, విజయవాడ లాంటి సిటీల్లో కూడా అందరికీ రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసాడు. అలాగే నాని ఈ సినిమాలో 3నిమిషాల పాటు కనిపించనున్నాడు. నవీన్, రాకేశ్, మెలినే కన్నోకద లు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి మహేష్ శంకర్, సచిన్ – జిగర్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు