క్రేజీ.. ‘కాంతార 1’ కోసం దేవా.. వరదరాజ మన్నార్

కన్నడ సినిమా నుంచి ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది అని చాలా మంది నమ్ముతున్నారు. ఇలా ఇటీవల అనౌన్స్ చేసిన ట్రైలర్ కోసం అంతా ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా మేకర్స్ కాంతార 1 ట్రైలర్ కోసం పాన్ ఇండియా బిగ్ స్టార్స్ ని తీసుకున్నారు.

ఇలా హిందీ కోసం హృతిక్ రోషన్ తమిళ్ కోసం శివ కార్తికేయన్ లని తీసుకోగా ఇక మలయాళం, తెలుగు వెర్షన్స్ రిలీజ్ కోసం సలార్ నటులు దేవా ప్రభాస్ ని వరదరాజ మన్నార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ లు విడుదల చేస్తున్నట్టుగా క్రేజీ అనౌన్సమెంట్ చేశారు. దీనితో ఈ రెండు భాషలు ట్రైలర్స్ ని ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు విడుదల చేయనున్నారని చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ ప్రీక్వెల్ ఈ అక్టోబర్ 1న రిలీజ్ కాబోతుంది.

Exit mobile version