పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఐతే, దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ఇక ‘కల్కి 2’ సినిమా విశేషాలు తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, కల్కి సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది అని, జూన్ ఫస్ట్ వీక్ నుంచి షూట్ స్టార్ట్ కానుంది అని, మొదటి షెడ్యూల్ లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది.
కల్కి సీక్వెల్ లో కమల్ హాసన్ కి సంబంధించిన పార్ట్ ఎక్కువ ఉంటుందట. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి. ‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనుంది.