మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పవర్ ఫుల్ మల్టీ స్టార్టింగ్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి మరో స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అల్లూరిగా చరణ్ ను భీం గా తారక్ ను చూపించి సెన్సేషన్ ను నమోదు చేసారు.
ఇక ఇదిలా ఉండగా భారీ చిత్రం నుంచి రాబోయే మరో భారీ అప్డేట్ కోసం ఇప్పుడు గాసిప్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికి ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్ లు బయటకు వచ్చాయి కానీ ఈసారి ఇద్దరు కలిపి ఉండే సిసలైన టీజర్ బయటకు రానున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా అన్నట్టు గట్టి టాక్.
ఈ చిత్రాన్ని స్వాతంత్ర యుద్ధ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు అమరవీరుల పై తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే రాజమౌళి ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారని నయా టాక్. మరి ఇదే కనుక నిజం అయితే ఇంకా మళ్ళీ రికార్డుల లెక్కలు మోత మోగడమే అని చెప్పాలి. ఇప్పటికే చాలా మేర షూటింగ్ అయిపోయిన ఈ చిత్రం నుంచి టీజర్ అప్పుడు రావొచ్చు అని చెప్పడానికి అవకాశాలు మెండు గానే కనిపిస్తున్నాయి. మరి ఈ క్రేజీ గాసిప్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.