ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉండగా లాక్ డౌన్ అనంతరం షూటింగ్ తిరిగి మొదలుకానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మూవీ ప్రధాన భాగం యూరప్ నేపథ్యంలో సాగనుంది. మెచ్యూర్డ్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఓ మూవీ ఒకే చేశారు.
పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. అశ్వినీ దత్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ భారీ చిత్రం ఏ జోనర్ లో రానుంది? కథ ఏమై ఉంటుంది అనే ప్రశ్నలు మూవీ ప్రకటించిన నాటినుండి ఫ్యాన్స్ లో ఉన్నాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం ఇది ఓ సోసియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. సామాన్య మానవుడు, దేవకన్యకు పుట్టిన ఓ వన్దర్ కిడ్ స్టోరీనే ఈ సినిమా అని పుకారు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్దిరోజులు ఆగాలి.