మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సాలిడ్ లైనప్ లో ఉన్న సంగతి తెలిసిందే. యువ దర్శకులు వశిష్ఠ, అనీల్ రావిపూడి, అలాగే శ్రీకాంత్ ఓదెల లాంటి వారితో మెగాస్టార్ లైనప్ మంచి టైట్ గా ఉంది. ఇక వీరు కాకుండా సిసలైన మాస్ కాంబినేషన్ పడనున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో మాస్ అభిమానులు మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ చిరు బోయపాటి కలయిక ఇప్పుడు సాధ్యం కాబోతుందట.
వీరి కలయికలో సినిమా ఇపుడు దాదాపు లాక్ అయినట్టే అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది నిజం అయితే వీరి మాస్ విధ్వంసం ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. బోయపాటి చిరు మార్క్ ని మ్యాచ్ చేసే సాలిడ్ మాస్ చిత్రం తీస్తే గనుక బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం అని చెప్పవచ్చు. మరి ఈ సంచలన కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
crazy buzz box office blasting combo chiru boyapati on cards soon