టాలీవుడ్ యువ హీరో ప్రియదర్శి అలాగే నటుడు శివాజీ సాలిడ్ పాత్రల్లో దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ కోర్ట్ డ్రామా “కోర్ట్”. మంచి ప్రమోషన్స్ మరియు బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అంచనాలు అందుకొని అదరగొట్టింది. అలా మొదటి రోజు నుంచే ప్రియదర్శి కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఇదే మూమెంటంని వీకెండ్ లోనే కాకుండా మొన్న సోమవారం కూడా కొనసాగించింది.
ఇలా నాలుగు రోజుల్లో 30 కోట్ల దగ్గర గ్రాస్ ని వరల్డ్ వైడ్ అందుకున్న ఈ చిత్రం ఇపుడు 5 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇలా వరల్డ్ వైడ్ ఐదో రోజుకి 33 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుని ఒక సూపర్ సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. యూఎస్ వసూళ్లు కూడా ఎక్కడా తగ్గకుండా కొనసాగుతూ ఉండడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా నాచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మాణం వహించారు.
The audience have ruled their judgement in favour of #CourtTelugu ????????????#Court continues to do well at the ticket windows and collects a gross of 33.55+ CRORES WORLDWIDE in 5 days ❤????
Book your tickets for #Court now!
▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️… pic.twitter.com/4vgoKK7N7z— Wall Poster Cinema (@walpostercinema) March 19, 2025