‘కూలీ’ ఓవర్సీస్ రైట్స్‌తో రజినీకాంత్ ఆల్‌టైమ్ రికార్డ్..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

అయితే, ఈ చిత్రానికి ఓవర్సీస్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ భారీ రేటుకు దక్కించుకుంది. ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ ఏకంగా రూ.86 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓ తమిళ చిత్రం ఈ రేంజ్‌లో ఓవర్సీస్ థియేట్రికల్ డీల్ జరగడంతో ఈ చిత్రం తమిళ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.

ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటే, ఈ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ అవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version