మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా గత ఏడాది రూపొందించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని యదు వంశీ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు పలు అవార్డులు, రివార్డులు దక్కాయి. అయితే, ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తన నెక్స్ట్ చిత్రాన్ని రూపొందించేందుకు యదు వంశీ సిద్ధమవుతున్నాడట. దీంతో ఈ సారి వీరిద్దరు ఎలాంటి సినిమాను తీసుకొస్తారా అనే ఆసక్తి నెలకొంది.
ఇక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రస్తుతం ప్రొడక్షన్ నెం.2గా ఫాంటసీ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మానస శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ అందిస్తున్నారు.