పట్టుదలతో కొనసాగుతున్న చాక్లెట్ స్టార్ పవన్ సినీ ప్రయాణం

పట్టుదలతో కొనసాగుతున్న చాక్లెట్ స్టార్ పవన్ సినీ ప్రయాణం

Published on Sep 23, 2025 7:02 AM IST

తెలుగు సినీ పరిశ్రమ కొత్త ప్రతిభను ఎప్పుడూ ఆహ్వానిస్తూ, వారికి ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుంటుంది. ఈ కోవలోనే యువ హీరో పవన్ తన తొలి చిత్రం చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే ద్వారా ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఆ చిత్రంతో వచ్చిన గుర్తింపు తర్వాత వరుసగా అనేక సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నాడు.

చాక్లెట్ స్టార్ పవన్ మాట్లాడుతూ “చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే చిత్రానికి నాకు సంతోషం అవార్డు దక్కింది. అలాగే సామాజిక సేవలో చేసిన కృషికి డాక్టరేట్ అవార్డు, కళారంగంలో చేస్తున్న కృషికి మరో డాక్టర్ అవార్డు కూడా పొందాను. ఈ గుర్తింపు నాకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది. దర్శక–నిర్మాతలు నన్ను ఇలాగే ఆదరిస్తూ, మరిన్ని మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

పవన్ నటించిన చిత్రాలలో మిస్టర్ కింగ్, ను రౌద్ర రూపాయ నమః, అప్పుడలా ఇప్పుడిలా, మేడారం జాతర, ఎలా, బ్రహ్మాండ, ఒసేయ్ రాములమ్మ, సువర్ణ, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే, కాలేజ్ పోరగాళ్లు, యువ నాయకుడు, మనసంతా నువ్వే పవన్ (న్యూ), మరియు ఇదేనా ప్రేమంటే వంటివి ఉన్నాయి. ప్రస్తుతం సేన, TS09, టెంపుల్ రన్, విశ్వ కర్ణ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

తాజా వార్తలు