కర్ణాటక మెగా ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షడు వెంకటేష్ యాదవ్ గత కొద్ది రోజులకు ముందు జరిగిన వోల్వో బస్సు యాక్సిడెంట్ ఘటనలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ షాక్ కు గురైయ్యారు. ఈ భాదకరమైన విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. దానిలో బాగంగా మెగా బ్రదర్ నాగబాబు 5లక్షల రూపాయల డి డి ని అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. చిరంజీవి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ డబ్బు వారికి అతన్ని తిరిగి బ్రతికించకపోయినా కానీ కొంతకాలం వరకు వారికి ఉపయోగపడవచ్చు.