ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది – మెగాస్టార్

తమిళ హీరో విజయ్‌ తన తన టీవీకే పార్టీ ప్రచారం కోసం తమిళనాడులో కరూర్ జిల్లాలో నిర్వహించిన ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన మరో 50 మందికి పైగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో, మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే, ఈ దురదృష్ట ఘటనపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ దుర్ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటన నన్ను చాలా తీవ్రంగా కలిచివేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అంటూ చిరంజీవి ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు.

Exit mobile version