ఆ విషయంలో చరణ్ ని చూస్తే ఈర్ష కలుగుతోందంటున్న చిరు.!

1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒకే సారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన సినిమా ‘తుఫాన్(హిందీలో జంజీర్)’. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఈ రోజు మధ్యాహ్నం పార్క్ హయత్ హోటల్లో రిలీజ్ చేసారు. ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘ లెజెండ్రీ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ సినిమా రీమేక్లో చరణ్ కి నటించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే అంతే ఈర్షగా ఉంది, ఎందుకంటే నేను హిందీలో సినిమా చేయడానికి నాకు 13 సంవత్సరాలు పట్టింది కానీ చరణ్ కి చాలా తొందరగా ఆ అవకాశం వచ్చింది. ఈ సినిమా కొంత చూసాను చాలా బాగుంది, చరణ్ నటన చాలా బాగుంది. ఎవరన్నా లైఫ్ లో నువ్వేం సాదించావు అనడిగితే అందరూ మెగాస్టార్ అయ్యాననో, మినిస్టర్ అయ్యాననో చెబుతానని అనుకుంటారు కానీ నేను మాత్రం నా పరువుని, గౌరవాన్ని నిలబెట్టే చరణ్ ని సాదించానని గర్వంగా చెప్పుకుంటానని’ ఆయన అన్నారు.

అలాగే రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా స్టొరీ మొదట చెప్పినప్పుడు వద్దు అని అపూర్వ లిఖియాని వెనక్కి పంపేసాను. నాలుగు నెలల తర్వాత మళ్ళీ వచ్చి రీమేక్ లాగా కాకుండా ఓ స్టొరీలా విను నచ్చేతే చెయ్యి, లేదంటే వద్దు అన్నాడు, సరే అని విన్నాను, కథ చాలా నచ్చింది. అప్పుడు నాకు ‘సినిమా కథ నచ్చకపోతే చెయ్యకు కానీ నచ్చితే మాత్రం వెనకడుగు వెయ్యొద్దు’ అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ తర్వాత ఆలోచించి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. కథకి నా వంతు న్యాయం నేను చేసానని’ అన్నాడు. ఈ కార్యక్రమానికి అపూర్వ లిఖియా, ప్రియాంక చోప్రా, శ్రీహరి, తదితరులు హాజరయ్యారు.

ఫస్ట్ లుక్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version