వరల్డ్ వైడ్ “ఛావా” 11 రోజుల వసూళ్లు ఎంతంటే!

వరల్డ్ వైడ్ “ఛావా” 11 రోజుల వసూళ్లు ఎంతంటే!

Published on Feb 25, 2025 8:13 PM IST

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. మరి విడుదల అయ్యిన మొదటి రోజు నుంచే పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో రీచ్ ని అందుకున్న ఈ చిత్రం కోసం మన తెలుగు ఆడియెన్స్ ఇప్పటికీ గట్టిగా తెలుగు డబ్బింగ్ కోసం డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇపుడు ఛావా సినిమా వరల్డ్ వైడ్ గా 11 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 11 రోజుల్లో ఇండియా వైడ్ గా 353 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకోగా వరల్డ్ వైడ్ గా మాత్రం 417 కోట్లకి పైగా నెట్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక ఈ వారానికి ఈజీగా 500 కోట్ల మార్క్ ని ఈ చిత్రం అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇక ఫైనల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు