మధుర శ్రీధర్ సినిమా గురించి ట్వీట్ చేసిన చేతన్ భగత్

Back-Bench-Student

అందరికీ బాగా తెలిలిసిన ఇండియన్ ఫేమస్ రైటర్ చేతన్ భగత్ మన టాలీవుడ్ డైరెక్టర్ మధుర శ్రీధర్ తో మంచి స్నేహ బంధం ఉంది. కొన్ని నెలల ముందు మధుర శ్రీధర్ గత సినిమా ‘ఇట్స్ మై లవ్ స్టొరీ గురించి ట్వీట్ చేసాడు, అలాగే ప్రీమియర్ షో చూడటానికి హైదరాబాద్ కూడా వచ్చాడు. ఈ రోజు మధుర శ్రీధర్ రాబోయే సినిమా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ గురించి ట్వీట్ చేసాడు.

‘మధుర శ్రీధర్ తీస్తున్న తెలుగు సినిమా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ పోస్టర్లో హీరో చదువుతున్న పుస్తకం ఏమిటి?’ అని ట్వీట్ చేసాడు. ఈ పోస్టర్లో హీరో మహాత్ రాఘవేంద్ర చేతన్ భగత్ రాసిన ‘వాట్ యంగ్ ఇండియా వాంట్స్’ అనే బుక్ చదువుతున్నాడు.

పియా బాజ్పాయి, అర్చన కవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎం.వి.కె రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ప్రసాద్ జి.కె సినిమాటోగ్రాఫర్.

Exit mobile version