యంగ్ హీరో నితిన్ ‘హార్ట్ అటాక్’ సినిమా షూటింగ్ లో భాగంగా స్పెయిన్ లో ఉన్నాడు. ఈ సినిమాని పూరి జగన్నాథ్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. స్పెయిన్ లో 4 రోజుల క్రితమే షూటింగ్ మొదలయ్యింది. ప్రస్తుతం నితిన్ పై థ్రిల్లింగ్ గా అనిపించే కొన్ని చేజింగ్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ యూనిట్ ఇంకా స్పెయిన్ లోనే 40 నుంచి 50 రోజులు షూటింగ్ చెయ్యాల్సి వస్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమా ద్వారా ఆద శర్మ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్, ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. నితిన్ ఈ మూవీలో స్టైలిష్ అవతారంలో కనిపించనున్నాడు. డిజైనర్ నీరజ కోన – నితిన్ కలిసి సరికొత్త లుక్ కోసం పనిచేస్తున్నారు.