బాలీవుడ్లో మెరవనున్న టాలీవుడ్ ఐటెం గర్ల్

Charmi
కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఫుల్ క్రేజ్ తెచ్చుకొని దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో నటించిన చార్మింగ్ బ్యూటీ చార్మీ గత కొంత కాలంగా అడపా దడపా తను చేస్తున్న ఐటెం సాంగ్స్ తోనే తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తోంది. ఇప్పటికే తెలుగులో పలు ఐటెం సాంగ్స్ చేసి ఐటెం గర్ల్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు తన జెండాని బాలీవుడ్లో ఎగురవేయనుంది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో షాహిద్ కపూర్ – సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న ‘రాంబో రాజ్ కుమార్’ సినిమాలో చార్మీ ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది. ఈ పాటకి సంబందించిన షూటింగ్ కూడా మొదలైంది. చార్మీ ఇప్పటికే ‘బుడ్డా హోగా తేరా బాప్’, ‘జిల్లా ఘజియాబాద్’ సినిమాలో నటించినా పెద్ద గుర్తింపు రాకపోవడంతో ఈ సారి ఐటెం సాంగ్ తో తన సత్తా చాటుకోవడానికి సిద్దమైంది. ఈ ఐటెం సాంగ్ బాలీవుడ్లో చార్మీకి ఎంత క్రేజ్ తెస్తుందో చూడాలి.

Exit mobile version