ఎం ఎస్ రాజు RUM లో చేరిన చార్మీ

Charmi
“నాయక్” మరియు “డమరుకం” వంటి చిత్రాలలో ఐటెం సాంగ్ చేశాక చార్మీ కి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఎం ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న “RUM – రంభ ఊర్వశి మేనక ” చిత్రంలో ఒక పాత్రను ఈ భామ సొంతం చేసుకుంది. త్రిష, నికిషా పటేల్ మరియు ఇషా చావ్లా లు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ఒమన్ లో ని మస్కట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ప్రధానకథానాయికలందరు కలిసి చిత్రీకరణ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. “వాన” మరియు “తూనీగా తూనీగా” వంటి చిత్రాల తరువాత ఎం ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న మూడవ చిత్రం ఇది. ఈసారి ఆయన ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఎంచుకున్నారు.

Exit mobile version