రామ్ చరణ్ ‘తుఫాన్’ కి ‘ఏ’ సర్టిఫికేట్

రామ్ చరణ్ ‘తుఫాన్’ కి ‘ఏ’ సర్టిఫికేట్

Published on Sep 2, 2013 3:10 PM IST

Thoofan-New-Poster
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ‘జంజీర్’. ఇదే వెర్షన్ కి కొన్ని మార్పులు చేసి ‘తుఫాన్’ గా తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషల్లో సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అపూర్వ లఖియా డైరెక్టర్. తెలుగు వెర్షన్ లో చేసిన మార్పులని డైరెక్టర్ యోగి దగ్గరుండి చూసుకుకున్నారు. తెలుగులో శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్రని హిందీలో సంజయ్ దత్ పోషించాడు. తుఫాన్ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ – పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమీత్ ప్రకాష్ మెహ్రా – ఫ్లైయింగ్ టర్టల్ ఫిల్మ్స్ వారు కలిసి నిర్మించారు.

తాజా వార్తలు